ర‌క్ష‌ణ‌మంత్రిని క‌లిసిన ఎంపీలు

న్యూఢిల్లీ: చెన్నైలో గల్లంతైన విమానం ఆచూకీపై వివరాలు తెలుసుకునేందుకు వైయ‌స్సార్సీపీ ఎంపీలు   రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ను కలిశారు. ఈ బృందంలో   ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సబ్ మెరైన్ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని రక్షణమంత్రి చెప్పినట్లు తెలిపారు. విమాన ప్రమాదంలో గల్లంతైనవారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని వారు వివరించారు.  బాధితులందరికీ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు. గల్లంతైన విమానం కండీషన్ లోనే ఉందని కేంద్ర మంత్రి చెప్పినట్లు వివరించారు.
 
Back to Top