పార్టీ ఎంపీలతో రేపు వైయస్ జగన్ భేటీ

సత్తెనపల్లి : పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు, అవిశ్వాస తీర్మానం తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించడానికి వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రె్డ్డి సోమవారం ఉదయం పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పళ్ల గ్రామంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
 ప్రత్యేక హోదా సాధనకు పోరాడుతున్న ఎంపిలు లోకసభలో వరుసగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తునప్పటికీ చర్చకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు, జాతీయ స్థాయి పరిణామాలపై ఎంపీలతో వైయస్ జగన్ చర్చించి, తదుపరి కార్యాచరణపై దిశా నిర్దేశం చేయనున్నారు.
.
పాదయాత్రకు విరామం

శ్రీరామ నవమి పర్వ దినం సందర్భంగా సోమవారం ప్రజా సంకల్పయాత్ర పాదయాత్రకు విరామం ప్రకటించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంగళవారం ఉదయం పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.

Back to Top