మొక్క‌వోని దీక్ష‌-ఆరో రోజుకు చేరిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల దీక్ష‌
- క్షీణిస్తున్న యువ ఎంపీల ఆరోగ్యం 
-  ఆందోళనకరంగా బీపీ, చక్కెర స్థాయిలు
-   దీక్షలకు వెల్లువెత్తుతున్న సంఘీభావం

న్యూఢిల్లీ: ‘ప్రత్యేక హోదా–ఆంధ్రుల హక్కు’ అని నినదిస్తూ పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు హోరెత్తేలా చేసిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపీల ఆమరణ దీక్షలు బుధ‌వారం ఆరో రోజుకు చేరాయి. ఐదుగురు ఎంపీల్లో ముగ్గురి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఇప్పటికే బల వంతంగా ఆసుపత్రికి తరలించారు. యువ ఎంపీలైన పీవీ మిథున్‌రెడ్డి, వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డిలు హోదా కలను సాకారం చేసేందుకు పట్టుదలతో దీక్షను ముందుకు తీసుకెళ్తున్నా రు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని రామ్‌మనోహర్‌ లోహియా (ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వీరిద్ద రూ ఇçప్పటికే డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నా రని.. షుగర్‌ లెవెల్స్‌ అంతకంతకూ పడిపోతు న్నాయని, ఇంకా దీక్ష కొనసాగిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన వైద్య పరీక్షల్లో అవినాష్‌రెడ్డి బీపీ 110/70, షుగర్‌ లెవెల్స్‌ 74, పల్స్‌రేటు 76కు పడిపోయాయి. మిథున్‌రెడ్డి బీపీ 106/70, షుగర్‌ లెవెల్స్‌ 78, పల్స్‌రేట్‌ 86కు పడిపోయాయి.   ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుండడంతో యువ ఎంపీలిద్దరూ బాగా నీరసించిపో యారు. కదలడానికి కూడా ఇబ్బందిపడుతు న్నారు. గంటలు గడిచే కొద్దీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని చెబుతున్నా వీరు మరింత అకుంఠిత దీక్షతో నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు. ‘మా రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా సాధనే మాకు ముఖ్యం.. అందుకోసం దేనికైనా  సిద్ధం’ అని వారు స్పష్టం చేస్తున్నారు. ఎంపీల దీక్షకు ప్రవాసాంధ్రులు, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు వివిధ ప్రజా సంఘాల వారు  తమ మద్దతును ప్రకటించారు.  


తాజా వీడియోలు

Back to Top