కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి ద్రోహం

ఢిల్లీ: కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఎంపీలు మీడియాతో మాట్లాడారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన ప్రత్యేకహోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి పోరాటం చేస్తుందని చెప్పారు. నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం చేస్తున్నారని వివరించారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలన్న చంద్రబాబు ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారని హింసిస్తున్నారని మండిపడ్డారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని ప్రజలు ఆవేదనలో ఉంటే..ఇపుడు ప్రత్యేక హోదా విషయంలో రోజుకో మాట మార్చుతూ ఎందుకు రంగులు మార్చుతున్నారని ప్రశ్నించారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ అయినా సాధించారా అని ప్రశ్నించారు.  

టీడీపీ మాటలు హాస్యాస్పదం: ఎంపీ వరప్రసాద్‌
టీడీపీ నేతలు ప్రత్యేక హోదాను కోరడం హాస్యాస్పదమని ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. మేం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి హేళన చేశారన్నారు. హోదాకు బదులు ప్యాకేజీ తెస్తున్నామని గొప్పలు చెప్పారన్నారు. ఈ రోజు ప్రజలు ప్రత్యేక హోదా కోరుతున్నారు కాబట్టి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. 
 
Back to Top