హోదా హామీ ఏమైంది..?

  • రెండున్నరేళ్లుగా ఎందుకు కాలయాపన చేస్తున్నారు
  • చట్టంలోని అంశాలను ఎందుకు అమలు చేయడం లేదు
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే
  • వైయస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుక 
న్యూఢిల్లీః  వైయస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేకహోదాపై లోక్ సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ ఏమైందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రసర్కార్ ను ప్రశ్నించారు. చట్టంలో ఉన్న అంశాలను ఎందుకు అమలు చేయడం లేదని సూటిగా ప్రశ్నలు సంధించారు. హోదాపై ఇంతవరకు ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదని అన్నారు. ప్రత్యేకహోదా కోసం తాము నిరసలు, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు అవేమీ పట్టించుకోవడం దారుణమన్నారు. 

ఏపీకి  ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఎంపీ బుట్టారేణుక డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ కొత్తదేమీ కాదని అన్నారు. రెండున్నరేళ్లుగా హోదాపై ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
Back to Top