లోక్ సభలో వైయస్సార్సీపీ ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీః ఏపీకి ప్రత్యేకహోదాపై లోక్ సభ దద్దరిల్లింది. రాష్ట్రానికి హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ ఎంపీలు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. హోదా ఇవ్వాలని స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం లోక్ సభలో వైయస్సార్సీపీ వాయిదా తీర్మాన నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పోడియం వద్ద  వైయస్సార్సీపీ ఎంపీలు హోదాపై చర్చకు పట్టుబట్టారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినదాలతో హోరెత్తించారు.  ఏపీకి ప్రత్యేకహోదాను ప్రకటించాల్సిందేనంటూ గట్టిగా పట్టుబట్టారు. పట్టువదలని విక్రమార్కుల్లా వైయస్సార్సీపీ ఎంపీలు చర్చకు పట్టబడడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. 

తాజా ఫోటోలు

Back to Top