కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఎంపీ వైవీ

న్యూఢిల్లీ: ఒక పార్టీ బీఫాంపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఫిరాయింపుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎంపీ కలిశారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నర గడిచినా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏపీ స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పైగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకున్నారన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. నిర్ణిత సమయంలో స్పీకర్‌ పిరాయింపులపై నిర్ణయం తీసుకునేలా చట్టాన్ని సవరించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు.

Back to Top