టీడీపీవి లాలూచీ రాజకీయాలు

 ఢిల్లీ:  టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా అంటూ ప్యాకేజీ, పోలవరం నిధుల కోసం టీడీపీ నేతలు పైరవీలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఈ విషయాన్ని  వైయస్‌ఆర్‌సీపీ ఏనాడో చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి రహస్యంగా భేటీ కావడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.  చంద్రబాబుకు తెలియకుండా సుజనా చౌదరి కలిశారనడం ఓ డ్రామా అన్నారు. చంద్రబాబు మొదటి నుంచి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను టీడీపీ మళ్లీ మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. మొదటి నుంచి మేం ప్రత్యేక హోదాపై నిలబడ్డామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 
 
Back to Top