మరోమారు తెలుగు వారి గొంతు నొక్కారు

– అక్కడ బాబు..ఇక్కడ మోడీ ఇద్దరూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
– వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు
– మంత్రుల రాజీనామా రోజే టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాల్సింది
 – వెల్‌లోకి సభ్యులు వచ్చినప్పుడు చాలా బిల్లులు పాస్‌ చేసుకున్నారు
–  సభ జరిగినంత కాలం అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తూనే ఉంటాం
ఢిల్లీ:  పార్లమెంట్‌ సాక్షిగా మరోమారు తెలుగు వారి గొంతు నొక్కే కార్యక్రమం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చే శారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే సభను వాయిదా వేయడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పేందుకు నిన్న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. మా పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. అందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇ చ్చారన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏపీకి ఏవిధంగా అన్యాయం చేస్తుందో అందరూ చూశారన్నారు. అవిశ్వాస తీర్మానం చదివే సమయంలో సభ ఆర్డర్‌లో లేకపోయిందన్నారు. నిన్న ఆర్థిక బిల్లు పాస్‌ చేసుకునేందుకు సభను నడుపుకున్నారని, ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తే సభ ఆర్డర్‌లో లేదని వాయిదా వేయడం అన్యాయమన్నారు. ఏపీలో చంద్రబాబు, ఇక్కడ ఎన్‌డీఏ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరిగినంత కాలం మా పోరాటాన్ని కొనసాగిస్తామని, అప్పటికి స్పందించకపోతే ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక హోదాను పోరాటం చేసి సాధించుకుంటామన్నారు. టీడీపీ ఇవాళ డ్రామాలాడుతుందని ఆయన మండిపడ్డారు. భాగస్వామ్య పార్టీ నుంచి బయటకు రాకుండా అవిశ్వాస తీర్మానం ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మంత్రులుగా రాజీనామా చేసినప్పుడే ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చేవారు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆరోజే అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండాల్సిందన్నారు. మేం అవిశ్వాస తీర్మానం పెట్టిన తరువాత ఇవాళ టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రజల్లో వైయస్‌ఆర్‌సీపీకి మంచి పేరు వస్తుందని టీడీపీ డ్రామాలు ఆడుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎవరు ముందుకు వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ మద్దతిస్తుందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి భయపడటం లేదని, అందుకే ఐదు మంది ఎంపీలు ఉన్నా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top