హోదా సాధనకు పోరాటం కొనసాగిస్తాం

ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధించే వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు అన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీలు మేకపాటి, వైవీ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు రోజుకో రకంగా మాట్లాడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటంతోనే ప్రత్యేక హోదా బతికిందన్నారు. ఇప్పుడు ఉద్యమం ఉధృతం కావడంతో చంద్రబాబు హోదా గురించి మాట్లాడుతున్నారన్నారు. మొన్నటి దాకా రాజీనామాలు ఎప్పుడు చేస్తారని అడిగిన టీడీపీ నేతలు, ఇప్పుడు రాజీనామాలతో ప్రయోజనమేంటని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమం జరుగుతూనే ఉంటుందని, ప్రజల పక్షాన నిలిచి ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతామన్నారు. 21వ తేదీన కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టడమే కాకుండా.. ఏప్రిల్‌ 6వ తేదీన ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తామన్నారు. 

Back to Top