రాజీనామాలను ఆమోదించాలని కోరుతాం


హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఎంపీ పదవులకు రాజీనామా చేశామని, వాటిని ఆమోదించుకుంటామని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గత నెలలో ఎంపీ పదవులకు చేసిన రాజీనామాలపై లోక్‌సభ స్పీకర్‌ నుంచి లేఖ వచ్చిందని ఆయన చెప్పారు.  29న స్పీకర్‌ ఎదుట హాజరు కావాలని స్పీకర్‌ తెలిపారన్నారు. స్పీకర్‌ను కలిసి ౖÐð యస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించాలని కోరుతామన్నారు. నెల దాటినా రాజీనామాలు ఆమోదించకపోవడం ఐదు కోట్ల ఆంధ్రులను అవమానించడమేనని ఇప్పటికే తెలిపామన్నారు. హోదా కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమే అని, వైయస్‌ జగన్‌ నేతృత్వంలో పోరాడి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
 
Back to Top