రాష్ట్రాన్ని ఆదుకోండిన్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఓ వినతిపత్రాన్ని అందజేశారు.  పోలవరం పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించాలని, విశాఖకు రైల్వే జోన్‌ కేటాయించాలని అందులో కోరారు. కేంద్ర సంస్థల నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీతో పాటు ప్రత్యేక హోదా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
 
Back to Top