ఆసుప‌త్రిలో దీక్ష కొన‌సాగిస్తున్న వైవీ సుబ్బారెడ్డి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరి లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజు సోమ‌వారం ఢిల్లీలోని ఆసుప‌త్రిలో కొన‌సాగుతోంది. ఇవాళ ఉద‌యం వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించ‌డంతో పోలీసులు బ‌ల‌వంతంగా ఆయ‌న్ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆయ‌న వైద్య‌చికిత్స‌ల‌కు స‌హ‌క‌రించ‌కుండా దీక్ష‌ను కొన‌సాగిస్తున్నారు. నాలుగోరోజు వైయ‌స్ఆర్‌సీపీ  ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డిలు కొనసాగిస్తున్న దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. పలు పార్టీల నేతలు దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజా సంఘాలు, విద్యార్థులు ఎంపీల దీక్షకు మద్దతు తెలుపుతున్నారు.  

తాజా ఫోటోలు

Back to Top