ఐదో సారి అవిశ్వాస తీర్మానం నోటీసు


ఢిల్లీ: లోక్‌సభ ముందుకు మరోసారి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. ఇవాళ ఉదయం లోక్‌సభ ప్రారంభం అయిన 30 సెకండ్లకే వాయిదా పడింది. దీంతో అవిశ్వాస తీర్మానం నోటీసులు ఐదో సారి లోక్‌సభ సెక్రటరీకి అందజేశారు. సభలో ప్రత్యేక హోదాపై చర్చ జరిగే వరకు నోటీసులు ఇస్తునే ఉంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు రాజ్యసభలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక హోదాపై నినాదాలు చేశారు. 
 
Back to Top