ఏపీకి ఎన్డీఏ సర్కార్‌ అన్యాయం చేసింది

* ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసింది
* హోదాతో పాటు విభజన హామీలన్నీ అమలు చేయాలి
* హోదా సాధించే వరకు మా పోరాటం ఆగదు
* చంద్రబాబువన్నీ డ్రామాలు
ఢిల్లీ: ‘‘ప్రత్యేక హోదా మా ఊపిరి.. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష కూడా. ఎన్డీఏ సర్కార్‌ కూడా 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. తిరుపతి వెంకన్న సాక్షిగా మాట ఇచ్చింది. అంతేకాదు బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. చంద్రబాబు కూడా ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. కచ్చితెంగా తెస్తామని కూడా చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా హోదా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు బీజేపీపై టీడీపీ, టీడీపీపై బీజేపీ విమర్శలు చేసుకుంటూ దొంగనాటకాలు ఆడుతున్నారు’’అంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. 

నాడు ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ ఢిల్లీకి మించిన రాజధానిని కట్టిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు మాత్రం నోరు మెదపడం లేదడం లేదన్నారు. బీజేపీ నాయకుడు నరసింహరావు మాట్లాడుతూ చట్టాలు మారాయని, ఇప్పుడు ఏపీకి హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ సర్కార్‌ ఒప్పుకుందని అన్నారు. అసలు ఒప్పుకోవడానికి వాళ్లు ఎవరు.. ఇవ్వడానికి మీరు ఎవరు అని ప్రశ్నించారు. పార్లమెంట్‌సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం ఉందని, అది కచ్చితంగా ఇవ్వాల్సిందేనన్నారు. 

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జాయింట్‌ పార్లమెంటరీ కమీషన్‌ (జేపీసీ) వేయమని అడుగుతున్నారని, అలా చేస్తే మరో రెండేళ్లు కాలయాపన చేయవచ్చని, మళ్లీ బీజేపీతో కొనసాగవచ్చని ప్లాన్‌ చేసినట్లున్నారన్నారు. ఇదంతా కూడా కుట్రలో భాగమేనని సుబ్బారెడ్డి అన్నారు. తన అవినీతిపై కేసులు వేయించుకోకుండా తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 

రేపటి రోజు అయినా అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతి ఇచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఏపీ ప్రజలకు ఇవ్వాలని కోరారు. ఈ రెండూ కుదరని పక్షంలో రేపటి రోజు వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులందరం రాజీనామా చేసి ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామన్నారు.  హోదా సాధించే వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని వైవీ సుబ్బారెడ్డి మరోమారు స్పష్టం చేశారు. 
Back to Top