బాబువన్నీ లాలూచీ రాజకీయాలే

వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఢిల్లీ: చంద్రబాబు నాయుడు మొదటి నుంచి లాలూచీ రాజకీయాలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా ఎన్డీయేతో కలిసి బహిరంగంగా కాపురం చేసిన టీడీపీ... ఇప్పుడు లోపాయకారంగా చేస్తుందని విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్యాకేజీ, పోలవరం నిధుల గురించి సుజనా చౌదరి కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయన్నారు. పోలవరం, ప్యాకేజీ అంటూ మళ్లీ హోదా కోసం పోరాటం అంటూ డ్రామాలు ఎందుకు ఆడుతున్నారన్నారు. ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మభ్యపెడతారని మండిపడ్డారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాం.. వైయస్‌ఆర్‌ సీపీ, బీజేపీ కలిసిపోయాయని ఆరోపణలు చేసిన చంద్రబాబు రహస్యభేటీపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 
Back to Top