ఈఆర్సీ నిర్ణయం హర్షణీయం

ట్రూ అప్ చార్జీలు పెంపు ప్ర‌తిపాద‌న‌లు తిర‌స్క‌రించ‌డంపై హ‌ర్షం
ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ‌లు ప్ర‌తిపాదించిన ట్రూ అప్ చార్జీల పెంపును ఏపీ విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి తిర‌స్క‌రించ‌డం ప‌ట్ల ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈమేరకు పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న ప‌త్రిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థ‌లైన ఏపీఈపీడీసీ, ఏపీఎస్‌పీడీసీ(డిస్క‌మ్‌లు) రూ.7,208.66 కోట్ల మేర‌కు ట్రూ అప్ చార్జీలు పెంచాల‌ని కోరుతూ ఏపీ విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లికి ప్ర‌తిపాద‌న‌లు పంపించార‌న్నారు. 

డిస్క‌మ్‌లు దొడ్డి దారిని ప్ర‌జ‌ల‌పైభారం మోపే ప్ర‌మాదం ఉంద‌ని ప‌సిగ‌ట్టి గ‌త నెల 27న క‌మిష‌న్‌కు లేఖ రాసిన‌ట్లు ఎంపీ పేర్కొన్నారు. ఇందులో డిస్క‌మ్‌లు
క‌మిష‌న్ ఎదుట చేస్తున్న వాద‌న‌లు ఎంత అస‌త్య‌మైన‌వో, బాధ్య‌తార‌హిత‌మైన‌వో, బూట‌క‌మైన‌వోలేఖ‌లో వివ‌రిస్తూ క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌స్టిస్ గ్రంధి భ‌వానీప్ర‌సాద్ ద్రుష్టికి తీసుకెళ్లిన‌ట్లు సుబ్బారెడ్డి వివ‌రించారు.రైతుల‌కు ఉచిత విద్యుత్ పంపిణీ వ‌ల‌న అయ్యే ఖ‌ర్చును రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించ‌కుండా త‌ప్పించుకునేందుకు ట్రూ అప్ చార్జీల‌ను పెంచాల‌ని కోరుతూ క‌మిష‌న్‌కు ప్ర‌తిపాద‌న‌లు చేసిన‌ట్లు వివ‌రించ‌డంతో ఏపీ విద్యుత్ నియంత్ర‌ణ‌మండ‌లి తిర‌స్క‌రించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న్ చైర్మ‌న్‌, ఇత‌ర స‌భ్యుల‌కు ఎంపీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.
Back to Top