పచ్చ చొక్కాలోళ్ల కోసమే టీడీపీ పథకాలు


 పశ్చిమగోదావరి : నాలుగు సంవత్సరాల టీడీపీ అరాచక పాలనలో ప్రజలందరూ విసిగి పోయారనీ, చంద్రబాబు పాలనెప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వడానికే తమ నేత వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారని అన్నారు. గత 13 నెలలుగా పాదయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌కు తెలుగుదేశం పాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రజలు చెప్తున్నారని అన్నారు. నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని సుబ్బారెడ్డి అన్నారు. 
తణుకులో జరిగిన కార్తీక వన సమారాధన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని మండిపడ్డారు. ‘ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే ప్రజలకు ఉపయోగపడాలి. కానీ, ఏపీలో పచ్చ చొక్కా లీడర్లు దోచుకోవడానికే పథకాలు తెస్తున్నారు’అని విమర్శలు గుప్పించారు. హోదా విషయంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా వంచనపై గర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 

Back to Top