జమ్మలమడుగు నడిరోడ్డుపై చర్చకు సిద్ధమా


వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యాక్షన్‌ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని, ఆయన చేసిన అభివృద్ధిపై జమ్మలమడుగు నడిరోడ్డుపై చర్చకు సిద్ధమా అని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దళితులపై టీడీపీ నేతల చేసిన దాడులను ఆయన ఖండించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ పెరగడంతో దాడులు చేస్తున్నారని ఎంపీ అవినాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. 
ఫ్యాక్షన్‌ మంత్రులను పెట్టుకొని చంద్రబాబు ఏం సాధిస్తారని ఎంపీ అవినాష్‌రెడ్డి నిలదీశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిపై జమ్మలమడుగు నడిరోడ్డుపై చర్చ పెడదామని సవాల్‌ విసిరారు.

 
Back to Top