జైల్లో పెడతామన్న వ్యక్తితో హోదా మన హక్కు అనిపించాం

ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనపై అధికార తెలుగుదేశం పార్టీ పూటకో మాట మాట్లాడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. రాత్రి ఏం మాట్లాడుతారో తెలియదు.. ఉదయం ఏం మాట్లాడుతున్నారో తెలియదు.. రాత్రికి రాత్రే టీడీపీ స్టాండ్‌లు మార్చుకుంటుందన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పేరు చెబితే జైల్లో పెడతామని చెప్పిన చంద్రబాబుతో హోదా మన హక్కు అని ప్రజలు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనిపించారన్నారు. అదే విధంగా అవిశ్వాస తీర్మానం తెలివి తక్కువతనం అన్న వ్యక్తితో అవిశ్వాసం పెట్టించారన్నారు. ఇది వైయస్‌ఆర్‌ సీపీ విజయమన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి పోరాడుతుందన్నారు. హోదా కోసం ఎందాకైనా వెళ్లి పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేని చంద్రబాబు స్వార్థరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
Back to Top