రాచ‌మ‌ల్లు దీక్ష‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి సంఘీభావంవైయ‌స్ఆర్ జిల్లా:  చేనేత కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న దీక్ష బుధ‌వారం మూడో రోజుకు చేరుకుంది. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే చేస్తున్న ధర్నాకు క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి, మేయ‌ర్ సురేష్‌బాబు, డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు.  చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి పింఛన్ మంజూరు అయినా దాన్ని అధికారులు పంపిణీ చేయడం లేద‌ని వైయ‌స్ అవినాష్‌రెడ్డి విమ‌ర్శించారు. చేనేత కార్మికుల‌కు అండ‌గా ఓ ఎమ్మెల్యే ఆందోళ‌న చేప‌ట్టినా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఈ నెల 8న ప్రొద్దుటూరుకు వ‌స్తున్న ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడికి ఈ అరాచ‌కాల‌ను వివ‌రిస్తామ‌ని తెలిపారు. తీరు మార్చుకోక‌పోతే ఉద్య‌మం తీవ్ర‌త‌రం చేస్తామ‌ని ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.
Back to Top