కడప రిమ్స్‌పై సీఎంకు వైయస్‌ అవినాష్‌రెడ్డి లేఖ

వైయస్‌ఆర్‌ జిల్లా: కడప రిమ్స్‌లో వైద్య సేవల గురించి రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. రిమ్స్‌లో వైద్య సేవలు దయనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల రిమ్స్‌లో సరైన వైద్యం అందక శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారన్నారు. వెంటనే రిమ్స్‌లో వైద్య, నర్సింగ్‌ సిబ్బందిని నియమించాలని లేఖలో డిమాండ్‌ చేశారు. అదే విధంగా కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలతో పాటు ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌లు ఏర్పాటు చేయాలని వైయస్‌ అవినాష్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 
Back to Top