ఎవ‌రితో క‌ల‌వాల్సిన అవ‌స‌రం లేదు

విశాఖ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవ‌రితో క‌ల‌వాల్సిన అవ‌స‌రం లేద‌ని ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. విశాఖ దీక్ష‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా విష‌యంలో తాను చేసింది తప్పు అని ప్రజలకు క్ష‌మాపణ చెప్పి తర్వాత చంద్రబాబు ధర్మపోరాటం, దీక్షలు చేయాలని సూచించారు.  నాలుగేళ్లు బీజేపీ, టీడీపీలు క‌లిసి కాపురం చేశాయ‌ని, మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకే చంద్ర‌బాబు కొత్త పార్టన‌ర్‌ను ఎన్నుకునే ప‌నిలో ప‌డ్డార‌న్నారు. కాంగ్రెస్‌కు ప‌ట్టిన గ‌తే బీజేపీకి, టీడీపీకి ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. బీజేపీతో వైయ‌స్ఆర్‌సీపీ క‌లుస్తుంద‌ని చంద్ర‌బాబు దుష్ర్ప‌చారం చేయ‌డం స‌రికాద‌న్నారు. మోడీ ప్ర‌భుత్వంపై ఏకంగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏకైక పార్టీ వైయ‌స్ఆర్‌సీపీనే అని గుర్తు చేశారు. సోనియాగాంది తన మాట వినలేదని  అక్రమంగా కేసులు పెట్టినా 16 మాసాలు జైలులో పెట్టినా వాటిని ఎదుర్కొన్న ధీరుడు జ‌గ‌న‌న్న అన్నారు. చంద్ర‌బాబు త‌న‌పై ఉన్న కేసులు విచార‌ణ‌కు రాకుండా చీక‌ట్లో కాళ్లు ప‌ట్టుకుంటున్నార‌న్నారు. చంద్రబాబు తన వద్ద ఉన్న పార్లమెంట్‌ సభ్యులతో రాజీనామాలు చేయించకుండా వారితో తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాబీయింగ్‌ చేస్తూ వంచన చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 

తాజా వీడియోలు

Back to Top