కొత్త‌ప‌ల్లి గీత‌ను అన‌ర్హురాలిగా ప్ర‌క‌టించాలి

న్యూఢిల్లీ:  పార్ల‌మెంట్ స‌భ్యురాలు కొత్త‌ప‌ల్లి గీత‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన నేప‌థ్యంలో ఆమె లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేసి ఆమెను అన‌ర్హురాలిగా ప్ర‌క‌టించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి కోరారు.ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌కు లేఖ రాశారు. కొత్త‌ప‌ల్లి గీత‌ 2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున అర‌కు ఎంపీగా గెలుపొందింది. Back to Top