రాజ్యాంగ పరిరక్షణకు ఎంత వరకైనా పోరాటం

ఢిల్లీ: టీడీపీ ఎంపీలు ఆడుతున్న నాటకాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తూ రాజ్యసభలో పాయింట్‌ ఆఫ్‌ ఆర్డన్‌ లేవనెత్తడం జరిగిందని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రూల్‌ 238–1, 238–2, రూల్‌ 238 ఏ కింద పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తడం జరిగిందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 75, 75 ప్రకారం కెబినెట్‌లో ఆమోదం పొందిన అంశాలను కెబినెట్‌ మంత్రులు వ్యతిరేకించడం ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినట్లు అవుతుందన్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆమోదించిన అంశాలను వ్యతిరేకించడం ఆ ప్రభుత్వంపై మంత్రివర్గ సభుడు విశ్వాసం కోల్పోయినట్లు ఆర్టికల్‌ చెబుతుందన్నారు. ఈ రోజు అదే అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తడం జరిగిందన్నారు. కేంద్రమంత్రికి ఇంకో మంత్రి సలహా ఇవ్వొచ్చని చైర్మన్‌ వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారన్నారు. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 74, 75లో ఒక మంత్రికి ఇంకో మంత్రికి కెబినెట్‌లో తీసుకున్న నిర్ణయం విషయంలో సలహా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఒక సందర్భంలో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు మీపై యాక్షన్‌ తీసుకుంటామని ప్రస్తావించారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో ఎక్కడ జాప్యం జరిగినా పోరాటం చేసి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్నారు.
Back to Top