విశాఖ బహిరంగ సభ చ్రరితలో నిలిచిపోతోంది

చ్రరితలో నిలిచిపోయే విధంగా విశాఖపట్నంలో జరిగే భారీ బహిరంగ జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. గత నెల 14న విశాఖ జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించిన తర్వాత నేడు విశాఖ నగరానికి ప్రవేశించిందన్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన∙ముఖద్వారానికి ప్రాధాన్యత వుందని శంఖరావం విజయానికి సంకేతమని, అలాగే మద్యం బాటిళ్ల నమూనా దశలవారీగా మద్యపాన నిషేధం విధించడం జరుగుతుందని చెప్పడానికేనన్నారు. మద్యపాన నిషేధం విధించాలని మహిళలు కోరుతున్నారని అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం దశలవారీగా అమలు జరుగుతుందన్నారు.  నవరత్నాలకు మరింత పదును పెట్టి,  ప్రజల వద్ద నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏపీ అభివృద్ధికి  దోహదపడే విధంగా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందన్నారు.
 
Back to Top