ఉమ్మడి ఎన్నికలను సమర్థిస్తున్నాం

ఆంధ్రరాష్ట్రానికి జిమిలి ఎన్నికలు కొత్తకాదు
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్య ఎన్నికలకు మద్దతు ఇస్తున్నాం
ఒకేసారి ఎన్నికలతో కరప్షన్, ఓటుకు కోట్ల కేసు లాంటివి ఉండవు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవికి బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదు
వైయస్‌ఆర్‌ సీపీ విధి విధానాల్లో మార్పు ఉండదు
చంద్రబాబు ఓ దగుర్భాజీ ముఖ్యమంత్రి
తన స్వార్థానికి దేశాన్ని అమ్మగలిగే ప్రమాదకర వ్యక్తి 
2003లో ముందస్తు ఎన్నికలకు ఎందుకెళ్లావు చంద్రబాబూ?
సింగపూర్‌ పర్యటనలో తిరుపతి జేఈఓ ఎందుకు
అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపిస్తాం

ఢిల్లీ: పార్లమెంట్, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర్థిస్తుందని వైయస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్వి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఢిల్లీలో లా కమిషన్‌ సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్రానికి ఉమ్మడి ఎన్నికలు కొత్త కాదని, 1951 నుంచి 1967 వరకు, మళ్లీ 1994 నుంచి 204 వరకు జరిగాయని, దీంట్లో పెద్దగా తేడా లేని స్పష్టంగా చెప్పామన్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు, కరప్షన్, ఓటుకు కోట్లు కేసు లాంటివి జరగవన్నారు. అధికారులను ఎన్నికల సమయంలో ఉపయోగించుకుంటారు కాబట్టి ప్రతీ సంవత్సరం ఎన్నికలు జరుపుకోవడం అభివృద్ధి నిరోధకం అని తెలియజేశామన్నారు. ప్రతి సంవత్సరం ఎన్నికలు జరిగితే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. లా కమిషన్‌ దగ్గర ఒక సందేహం కూడా వ్యక్తం చేశామని, పార్లమెంట్, అసెంబ్లీలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్ర భుత్వాన్ని ఏర్పటు చేయలేని పరిస్థితి లేనప్పుడు దాన్ని ఏరకంగా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తే.. ఒకవేళ పార్లమెంట్, అసెంబ్లీ ఐదు సంవత్సరాలకు ముందు రద్దు చేయాల్సి ఉంటే.. రాజ్యసభకు 6 సంవత్సరాల పదవీకాలం పూర్తయితే మధ్యలో ఎన్నికలు జరిపినట్లే నిర్వహిస్తామని సమాధానం ఇచ్చారన్నారు. అదే విధంగా ఎఫ్‌బీపీపీ అనే విషయాన్ని లా కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చామని, దాంట్లో ఉన్న ఉపయోగాలు, నిరుపయోగాలు అన్ని వ్యక్తం చేశామన్నారు. జిమిలి ఎన్నికలు ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి నిరోధకం కాదు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమర్థించామన్నారు. ఎన్నికల్లో రాజ్యాంగ సవవరణ చేయాల్సి ఉందని, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించాలని కమిషన్‌కు సలహా ఇచ్చినట్లు చెప్పారు. 

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవికి భారతీయ జనతా పార్టీకి, బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థిని నిలబెట్టినా వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు ఇవ్వదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ బీజేపీ, బీజేపీ మిత్రపక్షాలను బలపర్చదని చెప్పారు. ఎందుకంటే.. వైయస్‌ఆర్‌ సీపీ, వి«ధివిధానాలు ఉన్నాయని ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తుందో.. ఆ పార్టీకే మద్దతు ఇస్తామని గతంలో వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. దానికి అనుగుణంగా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వమని కోర్టుకు వెళ్లిన తరువాత సపోర్టు ఇవ్వకూడదని వైయస్‌ జగన్‌ నిర్ణయించారన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో సుప్రీం కోర్టులో కేంద్రం ప్రత్యేక హోదాపై అఫిడవిట్‌ ఫైల్‌ చేయలేదని, ఇస్తారనే ఆశతోనే సపోర్టు చేశామన్నారు. 

ఆంధ్రరాష్ట్ర ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీ తెచ్చుకున్న దగుర్భాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని మండిపడ్డారు. నైతిక విలువలు లేని వ్యక్తి, సమాజంలో అతి ప్రమాకరమైన వ్యక్తి. తన ప్రయోజనాల కోసం దేశాన్ని తాకట్టుపెట్టి అమ్మగలిగే క్యారెక్టర్‌ లెస్‌ పర్సన్‌ చంద్రబాబేనన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ విధి విధానాల్లో ఎప్పుడు మార్పులేదని, ప్రత్యేక  హోదా కోసం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోరాడుతూనే ఉన్నామన్నారు. రాష్ట్రంలో 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు, అందులో 4 నలుగురిని మంత్రులు చేశారని, వారిపై అనర్హత వేటు వేయాలనే పిటీషన్‌ పెండింగ్‌లో ఉందన్నారు. రాష్ట్రంలోనే కాదు పార్లమెంట్‌లో కూడా పెండింగ్‌లో ఉన్నాయని కమిషన్‌ ముందు చెప్పామన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ తగిన చర్యలు తీసుకోవడం లేదని, ఫిరాయింపు నిరోధక చట్టంలో సవరణలు చేయాలని కోరడం జరిగిందన్నారు. 

చంద్రబాబుకు దమ్ముంటే తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని విజయసాయిరెడ్డి సవాలు విసిరారు. 2003లో తిరుపతిలో పేలుడు సంభవించిన తరువాత ముందస్తు ఎన్నికలు కావాలని ఎందుకు కోరుకున్నారు..? రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి.. కేంద్రంలో వాజ్‌పయి చేత పార్లమెంట్‌ను రద్దు చేయించి ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు వద్దంటున్నారో చెప్పాలని నిలదీశారు. తాను అవినీతి మార్గంలో సంపాదించిన సొమ్మును దాచుకునేందుకు చంద్రబాబు సింగపూర్‌కు వెళ్లాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. లక్షల కోట్ల రూపాయలను చంద్రబాబు హవాలా రూపంలో విదేశాలకు తరలించాడన్నారు. సింగపూర్‌ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తన వెంట తిరుపతి జేఈఓను ఎందుకు తీసుకుకెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిపై వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తప్పకుండా విచారణ చేయిస్తామన్నారు. దోషులను శిక్షిస్తామని, దుర్మార్గుడు, అవినీతి పరుడు, దేశాన్ని కొల్లగొట్టిన వ్యక్తి చంద్రబాబు తప్పకుండా జైలుకు వెళ్తాడన్నారు. 
Back to Top