కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్న విజయసాయిరెడ్డి

ఢిల్లీ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను మధ్యాహ్నం 3 గంటలకు కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు, ఫిరాయింపులపై సీఈసీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి దగ్గరుండి కాలరాస్తున్నారని, వందల కోట్లు వెచ్చించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేశారని, అనైతిక విలువలన ప్రోత్సహిస్తున్న చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారు. 
 
Back to Top