మళ్లీ ప్రలోభాలకు దిగిన టీడీపీ

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలకు ఉత్తరాంధ్ర ఎంపీ ఫోన్‌
ఫోన్‌ రికార్డులతో ఈసీని కలవనున్న ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి: మరోసారి తెలుగుదేశం పార్టీ అడ్డంగా దొరికిపోయింది. తెలంగాణలో ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్‌ మీ అని చంద్రబాబు ఆడియో టేపులో అడ్డంగా దొరికిపోయినా తీరు మార్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి డబ్బులు ఇస్తామని, మాకు ఓటేయండని ఫోన్‌లో మాట్లాడారు. ఫోన్‌ సంభాషణ రికార్డులను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లన్నారు. బలం లేకపోయినా తెలుగుదేశం పార్టీ మూడో అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. 
 
Back to Top