రామకృష్ణబాబు ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదు


విశాఖ: విశాఖ ఈస్ట్‌ ఎమ్మెల్యే రామకృష్ణబాబు ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయనది గత చరిత్ర నేరమయమన్నారు. 8వ రోజు విజయసాయిరెడ్డి సంఘీభావ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 2009, 2014  ఎన్నికల్లో మీరు ఎవరిని ఎన్నుకున్నారో తెలుసా అని ప్రశ్నించారు.  వెలగపూడి రామకృష్ణబాబు గత చరిత్ర ఏంటో తెలుసా అన్నారు. ఆయన విజయవాడ నుంచి వచ్చారన్నారు. 30 ఏళ్ల క్రితం ఈయన విజయవాడలో రౌడీలకు దందాగా ఒక నేర సామాజ్యాన్ని నిర్మించుకొని కాపు సామాజిక వర్గం ఆరాధ్యదైవమైన వంగవీటి రంగాను హత్యచేసిన వారిలో మూడో ముద్దాయి అన్నారు. ఆ కేసు నుంచి  తప్పించుకొని తలదాచుకునేందుకు విశాఖ వచ్చారని వివరించారు. ఈ విషయం 2009లోనే తెలిసి ఉంటే బహుషా మీరు ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకునే వారు కాదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఒక నేరస్తుడు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్‌ కావడం తప్పు కాదని, అయితే అతని గత చరిత్ర నేరచరిత్ర అని మండిపడ్డారు. విశాఖలో కూడా అదే నేర సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆయన భూ కబ్జాలు, మద్యం సిండికెట్లు చేసి విశాఖ వాసులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడ జరిగే ప్రతి భూ కబ్జాలో కూడా ఆయన ప్రమేయం ఉందన్నారు. ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా అర్హుడా అని ప్రశ్నించారు. మీ కోసం పోరాటం చేస్తున్న వంశీకృష్ణ యాదవ్‌కు మద్దతివ్వాలని కోరారు. వంశీకృష్ణ యాదవ్‌కు మీరు అందిస్తున్న మద్దతు చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు. సంఘీభావ యాత్రలో వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, సీనియర్‌ నాయకులు మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top