పోరాటాన్ని అణచివేయడం దుర్మార్గం

ఢిల్లీ: శాంతియుతంగా ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటాన్ని అణచివేయడం దుర్మార్గమని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రులకు ప్రత్యేక హోదా హక్కు అని గతంలో పార్లమెంట్‌లో నిర్ణయం తీసుకున్నారన్నారు. నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని పోలీసుల చేత అణచివేయాలని చూస్తున్నారని, దీంట్లో చంద్రబాబు పాత్ర కూడా ఉందన్నారు. అరెస్టు అయినా పర్వాలేదు హోదా సాధించే వరకు పోరాడుతామన్నారు. 
–––––––––––––––
మా ప్రయత్నం అరెస్టులతో ఆగదు
వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు
ఢిల్లీ: ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షను తెలియజేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంపై ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో దేశ రాజధానిలో శాంతియుతంగా రాష్ట్ర హక్కుల సాధన కోసం ధర్నా చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రజానికానికి ఆంధ్రరాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తున్నమన్నారు. పోలీసులు హోదా ఉద్యమాన్ని అణచివేయడాన్ని నిరసిస్తున్నామన్నారు. మా ప్రయత్నం అరెస్టుల వల్ల ఆగదని, ప్రజల హక్కులను సంరక్షించేందుకు పోరాటం సాగుతుందన్నారు. 
––––––––––––––––––
కేంద్రాన్ని ఎదిరించడం వైయస్‌ జగన్‌కు కొత్తకాదు
పార్టీ సీనియర్‌ నేత కురసాల కన్నబాబు
ఢిల్లీ: రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినప్పుడల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఢిల్లీని ఎదిరిస్తూనే ఉన్నారని, కేంద్ర ప్రభుత్వాన్ని ఢీ కొట్టడం వైయస్‌ జగన్‌కు కొత్తకాదని పార్టీ సీనియర్‌ నేత కురసాల కన్నబాబు అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని ఎందుకు తప్పుతున్నారని ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బీజేపీ, టీడీపీ ప్రజలను మోసం చేస్తున్నారని అడుగుతుంటే.. దానికి అరెస్టులు చేస్తే ఉద్యమం ఆగదన్నారు.  
Back to Top