చంద్రబాబుకు క్యారెక్టర్‌..క్రెడిబులిటీ లేదు


విజ్ఞలు ఎవరూ చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌  ఇవ్వరు
ఢిల్లీ:  చంద్రబాబులాగా తాను అవినీతికి పాల్పడటం లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని చంద్రబాబు వాపోవడం ఆయనకు క్రెడిబులిటీ, క్యారెక్టర్‌ లేదన్న దానికి ఇదే నిదర్శనమన్నారు. అటువంటి వ్యక్తికి విజ్ఞులు ఎవరూ కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వరని అన్నారు. ప్రజల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని, ఓటుకు కోట్లు కేసు గురించి తప్పించమని కోరేందుకే ప్రధానిని చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కోరారన్నారు. అందుకే మోడీ అపాయింట్‌మెంట్‌ ఇ వ్వడం లేదన్నారు. ప్రత్యేక హోదా సాధనకు అవిశ్వాస తీర్మానం పెడుతున్నామన్నారు.
 
Back to Top