బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలే ముద్దాయిలు



న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవడానికి మొదటి ముద్దాయి బీజేపీ, రెండో ముద్దాయి టీడీపీ, మూడో ముద్దాయి కాంగ్రెస్‌ పార్టీలే అని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.  గత ప్రభుత్వపు తీర్మానాన్ని రద్దు చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తరువాతి ప్రభుత్వాలు గౌరవించాలని ఆయన కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికే కేబినెట్‌ తీర్మానం అమల్లో ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని టీడీపీ చెప్పిందని గుర్తు చేశారు. హోదా కోసం గత నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతోందని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ, కమ్యూనిస్టు, జనసేన హోదాను సంజీవని నమ్ముతున్నాయని, ఏపీకి  ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తరువాతి ప్రభుత్వాలు గౌరవించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top