పోలవరం వైయస్‌ఆర్‌ కల


తిరుపతి: పోలవరం ప్రాజెక్టు నిర్మించడం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కల అని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి  అన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆయన మండిపడ్డారు. మీ అబద్ధాలతో ప్రజలను మరోసారి మోసం చేయలేరని హెచ్చరించారు. ఇప్పటి వరకు చంద్రబాబు రూ.3 లక్షల కోట్లు విదేశాలకు తరలించారని ఆరోపించారు. రానున్న రోజుల్లో చంద్రబాబు, లోకేష్‌ జైలుకు వెళ్లక తప్పదని పేర్కొన్నారు. దేవుడి డబ్బును సైతం చంద్రబాబు , లోకేష్‌ దోచుకుంటున్నారని విమర్శించారు. 
 
Back to Top