ఎన్‌డీఏ కేబినెట్‌ నిర్ణయాల్లో బాబు భాగస్వామి

 – ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధిపై అనుమానం
–బాబు తన వద్ద ఉన్న  నల్లధనాన్ని హవాలా ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు
ఢిల్లీ: ఎన్‌డీఏ కేబినెట్‌ తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయాల్లో చంద్రబాబు కూడా భాగస్వామి అని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ద్వంద్వ వైఖరికీ చంద్రబాబు అద్దంపట్టే వ్యక్తి అని, ఆయనకు విలువలు లేవని మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ఈ విషయంలో ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సి న అవసరం ఉందన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టే నైతిక హక్కు టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటికి చంద్రబాబు భాగస్వామి అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం బాధాకరమన్నారు. అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరగాలని కోరుకుంటూ ఈ రోజు తాను వెల్‌లోకి వెళ్లకుండా సభ సజావుగా నిర్వహించాలని కోరానన్నారు. అయితే టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి సభను అడ్డుకున్నారన్నారు. ఏపీ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో తాను కృషి చేశానన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తున్నామన్నారు. నాలుగేళ్లుగా కేంద్రంతో, రాష్ట్రంలో బీజేపీ, టీడీపీలు అధికారాన్ని పంచుకున్నాయని తెలిపారు. ఈ రెండు పార్టీలు ఏపీ ప్రయోజనాలను విస్మరించాయని విమర్శించారు. హోదా అవసరం లేదని, ప్యాకేజీ కావాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారన్నారు. ఇప్పుడు టీడీపీ మంత్రులు రాజీనామా చేసి హోదా విషయంపై మాట్లాడుతున్నారంటే రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాలుగేళ్లలో విఫరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు ఎక్కడికి వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. హవాలా ద్వారా నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బాబు అవినీతిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. 

 
Back to Top