టీడీపీ ప్రలోభాలపై ఈసీకి ఫిర్యాదు

ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల కోసం తెలుగు దేశం పార్టీ మరోమారు ప్రలోభాలకు తెర లేపింది. ఈ నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయాలని ఏపీలోకి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ మంత్రి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ ఆడియో టేపులతో దొరికిపోయారు. ఆ ఆడియో టేపులతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు కూడా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయి దేశవ్యాప్తంగా అప్రతిష్టపాలయ్యారు. ఇది చాలదన్నట్లు మరోమారు చంద్రబాబు ఆదేశాలతో ఆ పార్టీ మంత్రి ప్రలోభాలకు గురి చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. 
 
Back to Top