ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం

అధికారంలోకి వచ్చాక ముస్లింల భూములు వారి సంస్థలకే
వక్ఫ్‌బోర్డు భూములను టీడీపీ భూకబ్జాదారులు ఆక్రమించారు

విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ముస్లిం భూములను వారి సంస్థలకే అప్పగిస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. విశాఖపట్నం మ్రరిపాలెంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్‌ బోర్డు భూములను టీడీపీకి చెందిన భూ కబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారన్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వానికి ముస్లింల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలు వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అప్పుడే రాజన్న రాజ్యం మళ్లీ తిరిగొస్తుందన్నారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ 15 గంటల పాటు ఉపవాసం చేయాలని, అప్పుడే ఆకలి విలువ తెలుస్తుందని చెప్పిన ఖురాన్‌ గ్రంథం ఎంతో ప్రవిత్రమైందన్నారు. 
Back to Top