చంద్రబాబు చేసేది ధ‌ర్మ‌మా? అధర్మ‌మా?

విశాఖ‌:  చంద్రబాబు చేసేది ధ‌ర్మ పోరాట‌మా? అధర్మ పోరాట‌మా ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ‌లో ఏర్పాటు చేసిన వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌లో ఆయ‌న మాట్లాడుతూ..నాలుగేళ్లు బీజేపీ-టీడీపీ క‌లిసి కాపురం చేసి ప్ర‌జ‌ల‌ను వంచించాయ‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీజేపీ, టీడీïపీలు వంచనకు గురిచేయడాన్ని నిరసిస్తూ ‘వంచన వ్యతిరేక దీక్ష’ను తలపెట్టామని వెల్లడించారు. పైకి బీజేపీతో పోరాటం చేస్తున్న‌ట్లు ఫోజులు కొడుతూ..లో లోప‌ల బీజేపీ నేత‌ల‌ను మ‌చ్చిక చేసుకుంటున్నారన్నారు. ఎన్‌డీఏ నుంచి చంద్ర‌బాబు తొల‌గిపోతే బీజేపీ మ‌హారాష్ట్ర మంత్రి భార్య‌కు టీటీడీ బోర్డు స‌భ్యురాలిగా ఎలా నియ‌మిస్తార‌న్నారు. చంద్ర‌బాబుపై తాను చేసే ప్ర‌తి ఆరోప‌ణ‌కు త‌న వ‌ద్ద ఆధారాలున్నాయ‌ని విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టంచేశారు.

తాజా ఫోటోలు

Back to Top