రాజ్యాంగాన్ని కాపాడండి


– రాష్ట్రపతి దృష్టికి నాలుగు అంశాలు
– రాజ్యసభ ఎన్నికల కోసం మారోమారు ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ కుట్ర
– వైయస్‌ జగన్‌ పాదయాత్రపై రాష్ట్రపతి ఆరా

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విలువలను కాపాడాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కోరారు. గురువారం సాయంత్రం ఆయన రాష్ట్రపతిని కలిసి నాలుగు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సారిగా ఆయన్ను కలిశామని, నాలుగు ముఖ్యమైన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ పాదయాత్ర గురించి రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారన్నారు. టీడీపీ  రాష్ట్రపతి ప్రసంగం మీద అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను, టీడీపీ కేంద్ర మంత్రులు రాష్ట్రపతి ప్రసంగంపై అనుసరిస్తున్న తీరును ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాజ్యాంగంలోని 74, 75ను టీడీపీ మంత్రులు ఎలా అధిగమించారన్న విషయాలను తెలిపామన్నారు. మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం టీడీపీ మరోమారు ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తుందని రాష్ట్రపతికి వివరించినట్లు చెప్పారు. గతంలో 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తన వద్ద ఉన్న అవినీతి సొమ్ముతో ఒక్కొక్కరిని రూ.30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారని, మళ్లీ మరో నలుగురు ఎమ్మెల్యేలను మా పార్టీ నుంచి తీసుకెళ్లందుకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్‌ చేసినట్లు చెప్పారు. రెండు రోజుల క్రితం ఎంపీ టీజీ వెంకటేశ్‌ మా ఎమ్మెల్యేలతో మాట్లాడారని, మా పార్టీలోకి వస్తే రూ.25 కోట్లు ఇస్తామని, రాబోయే ఎన్నికల్లో సీటు  ఇచ్చి ఎన్నికల ఖర్చు కూడా మేమే భరిస్తామని ఆఫర్‌ చేసినట్లు మా దృష్టికి వచ్చినట్లు చెప్పారు. అలాగే ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌ అనే బుక్‌లోని విషయాలను రాష్ట్రపతికి వివరించామన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రెసిడెంట్‌కు తెలిపామన్నారు. ప్రతి విషయంలో రాష్ట్రానికి అ న్యాయం జరిగిందని ఆయనకు చెప్పామన్నారు. 

బాబులా నేను లంచాలు తీసుకోవడం లేదు..
ఢిల్లీలోని పవర్‌ కారిడార్‌లో విజయసాయిరెడ్డి అటుఇటు తిరుగుతున్నారని సీఎం వ్యాఖ్యలు చేశారని, పార్లమెంట్‌ సభ్యుడిగా ఎవరైనా కలువచ్చు అన్నారు. ప్రతి విషయంలో సీఎం మాదిరిగా లంచాలు తీసుకోవడం లేదన్నారు. అలాంటి సమయంలో మాపై ఆరోపణ చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ఏం చేసుకుంటారో చేసుకోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రాష్ట్రపతికి ఒక్కరికే కాదు, రేపు ఎన్నికల కమిషన్‌కు కూడా చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

 
Back to Top