చంద్రబాబుకు విధి విధానాలు లేవు

ఢిల్లీ:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. అన్ని రాజకీయ పార్టీలతోనూ చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని, ప్రతి రెండు, మూడేళ్లకోసారి భాగస్వామిని బాబు మారుస్తారని, ఆయనకు చిత్తశుద్ధి, విధివిధానాలు లేవని ధ్వ‌జ‌మెత్తారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని విమర్శించారు. ఢిల్లీలో విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.  ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమ‌ర్శించారు. మొదట తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తామని చెప్పి.. ఆ తర్వాత చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని గుర్తుచేశారు. హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న బాబుకు నైతిక విలువలు ఉన్నాయా? అని నిలదీశారు. చంద్రబాబుకు ఏపీ ప్రయోజనాలు పట్టవని, ఆయన తన నీడనే తాను నమ్మరని అన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా తాను ఎవరినైనా కలుస్తానని, దానికి చంద్రబాబు పర్మిషన్‌ అవసరం లేదన్నారు. 
Back to Top