చంద్రబాబుకు విజయసాయిరెడ్డి మరో సవాలుహైదరాబాద: టీటీడీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండు చేశారు. దర్యాప్తులో చంద్రబాబు నిర్దోషి అని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని విజయసాయిరెడ్డి సవాలు విసిరారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు.  విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన స్పష్టం చేశారు. నోటీసులు అందితే చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు. చంద్రబాబుకు మరో సవాలు విసిరారు. 13 గంటల గడువు ఇస్తే 240 గంటల తరువాత స్పందించి టీటీడీ నుంచి నోటీసులు అందించారని చెప్పారు. నోటీసులు ఇచ్చే అర్హత టీటీడీకి లేదన్నారు. 
 
Back to Top