పని చేసే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపే


విశాఖ:  కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికీ వైయస్‌ఆర్‌సీపీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు.  విశాఖలోని దక్షిణ నియోజకవర్గం పరిధిలోని బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణా తరగతులు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రాబోతుందని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే రామరాజ్యం వస్తుందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుందని, అడుగడుగునా జననేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తమ సమస్యలు పరిష్కరించే నాయకుడొచ్చారని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో దగపడ్డ ప్రతి ఒక్కరూ వైయస్‌ జగన్‌ సీఎం కావాలని కోరుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్‌ సాధ్యమవుతుందన్నారు. టీడీపీ అరాచక, అవినీతి పాలనకు చరమ గీతం పాడేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.
 
Back to Top