బాబు అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

విశాఖ: చంద్రబాబు అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం గాజువాక నియోజకవర్గంలోని వైయస్‌ఆర్‌సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాబు పాలనలో ఏ ఒక్కరన్న సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం రావడానికి కార్యకర్తలు మరో పది నెలలు ఓపికతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీ జెండాలు ఎగురవేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలనకు చరమ గీతం పాడుదామన్నారు. బాబు విదేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 
  
 
 
Back to Top