తిరుమల ఆభరణాలను విదేశాలకు తరలించే అవకాశం


విశాఖ: తిరుమలలోని నేలమాళిగలో దొరికిన విలువైన అభరణాలను అమరావతి, హైదరాబాద్‌లోని సీఎం ఇంటికి తరలించే అవకాశం ఉందని, 12 గంటలకు మించి సమయం ఇస్తే తిరుమల ఆభరణాలను చంద్రబాబు విదేశాలకు తరలించే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 13 గంటల్లోగా ఆభరణాల గురించి తేల్చకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.  వేల మంది పోలీసులను పెట్టుకున్నా..ప్రజాభిమానం ఉన్న వైయస్‌ఆర్‌సీపీని చంద్రబాబు అడ్డుకోలేరన్నారు.   హెరిటేజ్‌తోనే ఇన్ని ఆస్తులు కూడబెట్టారంటే చంద్రబాబుకు సాధ్యం కాదని, లోకేష్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటున్న చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. తిరుమల పోటులో మరమ్మతుల పేరుతో 20 రోజుల పాటు కార్యాకలాపాలను రద్దు చేశారన్నారు. ఆభరణపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు.
 
Back to Top