వైయస్‌ఆర్‌సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం


– బాబుది కొండపైనా దోస్తి..కొండ కింద కుస్తీ?
–ప్రత్యేక హోదా సాధనకు పోరాటం కొనసాగిద్దాం
– చంద్రబాబు అధర్మవాది అని ఎన్టీఆర్‌ ఆనాడే చెప్పారు
– ముడుపుల కోసమే పోలవరం తీసుకున్నారు
– రైల్వే జోన్‌ బిక్ష కాదు..ఏపీ హక్కు
విశాఖ: విభజన చట్టంలోని హామీలైన ప్రత్యేక హోదా సాధన, రైల్వే జోన్‌ కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన వంచన వ్యతిరేక దీక్షలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ధ్వంద ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని ఘనంగా చెప్పుకుంటున్న చంద్రబాబుకు ధర్మం అనే పదానికి నిర్వచనం తెలుసా అని నిలదీశారు. ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అన్యాయంగా ఆయన్ను పదవీచ్యుతుడిని చేశారని విమర్శించారు. చంద్రబాబును ఒక అన్యాయస్తుడు, అధర్మం చేసిన వ్యక్తిగా స్వయగా చంద్రబాబు మామగారే పేర్కొన్నారన్నారు. ఏపీ పునర్వీభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని కడుతామని ఒప్పుకుంటే..ఒక ముఖ్యమంత్రిగా పోలవరాన్ని ముడుపుల కోసం తీసుకున్నది వాస్తవం కాదా అన్నారు. జూన్‌ 8, 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలిపే వరకు ప్రమాణం చేయనని చెప్పుకున్న చంద్రబాబు ఇదే కండీషన్‌ ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు కేంద్రానికి చెప్పలేదని ప్రశ్నించారు. ఎక్కడైతే మీరు ధనార్జన చేసుకోవచ్చో అక్కడ ఏపీ ప్రయోజనాలు కనిపించవని విమర్శించారు. చంద్రబాబు చేసిన తప్పులపై ఎక్కడ కేంద్రం సీబీఐ విచారణచేపడుతుందో అన్న భయంతో బీజేపీతో రహస్య రాయబారాలు నడుపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిజంగా ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే తాను చెప్పే పది అంశాలకు సమాధానం చెప్పాలన్నారు. వైయస్‌ఆర్‌సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏ పార్టీ కాపాడుతుందో ఆ పార్టీతో కలిసి పని చేస్తామన్నారు. ప్రత్యేక హోదా కోసం మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

విశాఖకు రైల్వే జోన్‌ ఇస్తామని పున ర్విభజన చట్టంలో పేర్కొన్నారన్నారు. ఈ విషయంలో రైల్వే శాఖ మంత్రి చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. చట్ట ప్రకారం ఏపీకి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఇవ్వాల్సి ఉందని కేంద్రానికి పలుమార్లు డిమాండు చేశానని చెప్పారు. రైల్వే జోన్‌ ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేశామని చెబుతున్న కేంద్రం విశాఖలో ఎవరిని సంప్రదించకుండా నివేదిక ఎలా తయారు చేస్తారని ప్రశ్నించారు. రైల్వే జోన్‌ వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని నిరోధించేందుకు పోరాటం చేస్తున్నారని చెప్పారు.  
 
Back to Top