బీజేపీ..టీడీపీలు ఏపీ ప్రజలను వంచించాయి


  ఈ నెల 30న విశాఖలో వంచన దినం
– ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖ: ఏపీ ప్రజలను బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు వంచించాయని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రజలను వంచించిన తీరుకు నిరసనగా ఏప్రిల్‌ 30న విశాఖలో పెద్ద ఎత్తున వంచన దినం పాటిస్తూ 12 గంటల పాటు దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. హోదా సాధనకు వైయస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నార ని చెప్పారు. హోదా ఇస్తామన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. 2014 ఏప్రిల్‌లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ, సీఎం అభ్యర్థి చంద్రబాబు తిరుపతి సభలో పదిహేనేళ్లు హోదా ఇస్తామని మాట తప్పారన్నారు. రాష్ట్ర ప్రజలను వంచించి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఏప్రిల్‌ 30న వంచన దినంగా పాటిస్తున్నామన్నారు.  వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణదీక్ష  అనంతరం చేపడుతున్న మొట్ట మొదటి కార్యక్రమం వంచన దినం విశాఖలో చేపడుతున్నామన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతుందన్నారు. వంచన దినం సందర్భంగా 12 గంటల పాటు రాష్ట్రంలోని వైయస్‌ఆర్‌సీపీ నాయకులందరూ విశాఖ దీక్షలో పాల్గొంటారన్నారు. 
 
Back to Top