ప్రభుత్వాల మెడలు వంచైనా హోదా సాధించుకుంటాం

విశాఖపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధించుకుంటామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన ఏపీ బంద్‌లో భాగంగా విశాఖపట్నం జిల్లా మద్దెలపాలెం జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగూణంగా రాజకీయ పార్టీలు నడుచుకొని పోరాటం సాగిస్తున్నప్పుడు బంద్‌ విజయవంతం అవుతుందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సంజీవని అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామ పక్షాలు బంద్‌ను నిర్వహిస్తుందన్నారు. బంద్‌ చేయడం ద్వారా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలపాలని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బంద్‌ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమని, 1885లోనే కాంగ్రెస్‌ పార్టీ మొదలు పెట్టిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ బంద్‌లు చేయలేదా అని ప్రశ్నించారు. ఐదు కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు బంద్‌ కొనసాగుతుందన్నారు. ప్యాకేజీ ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదని, హోదా వచ్చాక జరిగే అభివృద్ధి శతాబ్దం పాటు ఉంటుందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top