చంద్ర‌బాబుకు స‌వాల్‌


- ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు  సిద్ధం
-  చంద్రబాబే టైం, ప్లేస్ డిసైడ్‌ చేసుకోవచ్చు
 ఢిల్లీ:  కేంద్రంతో ఎవ‌రు లాలూచి ప‌డుతున్నారో బ‌హిరంగంగా చ‌ర్చించేందుకు సిద్ధం కావాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స‌వాల్ విసిరారు.త‌న‌పై ఉన్న కేసుల విచారణ జరుగకుండా కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని, నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీతో లాలూచీ రాజకీయాలు జరిపిన చంద్రబాబునాయుడి వైఖరిని ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. బుధ‌వారం ఉదయం పార్లమెంట్‌ ముందు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నిన్న తనను ఉద్దేశించి టీడీపీ సీఎం రమేష్‌ చేసిన సవాల్‌ను ప్రస్తావించారు. తాను రమేష్‌కు కాకుండా, చంద్రబాబుకే సవాల్‌ విసురుతున్నానని, ఎవరు లాలూచీ పడుతున్నారో, బహిరంగ వేదికపై చర్చకు సిద్ధమని, న్యాయ నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులను పిలిచి, వారి మధ్య చర్చించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని, సమయం, ప్రాంతం చంద్రబాబే డిసైడ్‌ చేసుకోవచ్చని అన్నారు.
 
 

తాజా ఫోటోలు

Back to Top