చంద్రబాబు చార్లెస్‌ శోభరాజ్‌ను మించిన గజదొంగ

టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా నేరగాళ్లే.. ఆ ముఠా నాయకుడు చంద్రబాబు
బ్యాంక్‌లను మోసం చేసిన వ్యక్తి సుజనాచౌదరి
తల్లిదండ్రులకు పుట్టినవారైతే నాపై ఆరోపణలు చేయరు
చిత్తశుద్ధి లేని వ్యక్తి అఖిలపక్షం నిర్వహించడం విడ్డూరం
టీడీపీ ఎంపీలు ప్రధానిని కలిస్తే బాబు తోకపత్రికలకు తప్పుగా లేదా?

ఢిల్లీ: సీఎం చంద్రబాబు చార్లెస్‌ శోభరాజ్‌ను మించిన గజదొంగ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలంతా దొంగలేనని, ఆ ముఠా నాయకుడు చంద్రబాబు అని ఆరోపించారు. ఢిల్లీలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి ఒక నేరగాడని, గతంలో వ్యవస్థలను మేనేజ్‌ చేసుకొని, కొన్ని కేసులను విత్‌డ్రా చేయించుకొని, మరికొన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఓటుకు కోట్ల కేసులో కూడా ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి మేనేజ్‌ చేసుకున్నాడన్నారు. నిజంగా చంద్రబాబుకు మనస్సాక్షి ఉంటే.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారించిన వాయిస్‌ నాది కాదని చంద్రబాబు న్యాయస్థానం ముందు నిలబడి నిరూపించుకోవాలన్నారు. 

ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా నేరగాళ్లే..
తెలుగుదేశం పార్టీలోని ప్రతి శాసనసభ్యుడు, పార్లమెంట్‌ సభ్యులు అందరూ నేరం చేసిన వారేనని, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు దురుద్దేశ్యంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల రవి కొన్ని వందల హత్యలు చేశారు. చింతమనేని ప్రభాకర్‌ రెండేళ్లు శిక్షపడినా స్టేలు తెచ్చుకొని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. పేకాట క్లబ్‌లు నిర్వహించే వ్యక్తి ఎంపీ. జమ్మలమడుగు నుంచి వెళ్లి బెంగళూరులో పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్న వ్యక్తి మంత్రి. ఎమ్మెల్యే కావాలనే దుర్దేశ్యంతో సొంత వదినను చంపిన వ్యక్తి కేబినెట్‌లో మంత్రి. ఇలాంటి నేరాలు చెప్పాలంటే కోకొల్లలుగా ఉన్నాయన్నారు. మూడేళ్లుగా కేంద్రంలో మంత్రిగా కొనసాగిన సుజనాచౌదరి బ్యాంక్‌లను దోపిడీ చేసిన ఆర్థిక నేరగాడని స్పష్టం చేశారు. మారిషస్‌ బ్యాంక్‌ను వందల కోట్లు మోసం చేస్తే కేసు ఆ దేశం కేసుట్టిందన్నారు. ఫిబ్రవరి 20, మార్చి 1, 5, 20వ తేదీల్లో, ఏప్రిల్‌1, 7 ఇలా రోజుల్లో సుజనాచౌదరి కోర్టు సమాన్లు అందిస్తే హాజరుకాని నేపథ్యంలో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిందన్నారు. చివరకు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న వ్యక్తిని చంద్రబాబు మంత్రిని చేశారన్నారు. 

వారు కలిస్తే తప్పులేదా?
ప్రధాన మంత్రిని తనకంటే ముందు టీడీపీ ఎంపీ సుజనాచౌదరి కలిశారని అది చంద్రబాబు తోక పత్రిక ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి తప్పుగా కనిపించడం లేదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆ తరువాత తాను ప్రధానిని కలిసి భారతీయ సంస్కృతి ప్రకారం నమస్కారం చేస్తే ఆయన ప్రతి నమస్కారం చేశారన్నారు. ప్రధానిని కలిసినా ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. చంద్రబాబునాయుడు, ఆయన తోక పత్రికలు, ఛానళ్లు ప్రచారం చేసేది కుట్ర తప్ప వాస్తవం లేదన్నారు. చంద్రబాబు కుసంస్కారి కాబట్టే ఇలాంటి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. 

యూటర్న్‌ అంకుల్‌ అఖిలపక్షం విడ్డూరం
దొంగ‌లు ప‌డ్డ ఆరు నెల‌ల‌ తరువాత కుక్కలు మొరిగినట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 2016లో ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ మేలని స్వాగతించిన చంద్రబాబు ఇప్పుడు నిద్రలేచారన్నారు. రాష్ట్రమంతా హోదా కోరుకుంటుంది కనుక రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారనే భయంతో యూటర్న్‌ తీసుకున్న ‘యూటర్న్‌ అంకుల్‌’ అఖిలపక్ష సమావేశం అంటూ డ్రామాలు ఆడుతున్నాడని విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదు కాబట్టే అఖిలపక్ష సమావేశానికి వెళ్లలేదన్నారు. హోదా అంటే జైల్లో పెడతామని, రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి అఖిలపక్ష సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top