అవినీతిపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధపడాలి

చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
వారంలో విచారణ వేసుకోకపోతే అవినీతికి పాల్పడినట్లే
ఢిల్లీ: చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నేతలు, పవన్‌ కల్యాణ్‌ చేసిన అవినీతి ఆరోపణలపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధపడాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పోటీ చేసిన పార్టీలే బాబు అవినీతిని వేలెత్తి చూపుతున్నాయన్నారు. దీనిపై ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా, టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబుపై ఉందన్నారు. ఢిల్లీలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ సోము వీ్రరాజు, పవన్‌ కల్యాణ్‌ ముగ్గురు చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై మాట్లాడుతున్నారన్నారు. పోలవరం, పట్టిసీమ, రాజధాని నిర్మాణం ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారన్నారు. లక్షల కోట్లు దండుకొని విదేశాలకు తరలించారన్నారు. అవినీతిపై వైయస్‌ఆర్‌ సీపీ సీబీఐ విచారణ కోరుతుందని చెప్పారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఓక్స్‌వ్యాగన్, ఔటర్‌రింగ్‌ రోడ్డు, పరిటాల రవి విషయంలో సీబీఐ ఎంక్వైరీ వేసుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు కూడా అవినీతికి పాల్పడలేదనే ధైర్యం ఉంటే ఎంక్వైరీ వేసుకోవాలని, వారంలో విచారణ వేసుకోకపోతే  అవినీతికి పాల్పడినట్లేనన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top